VIDEO: పిడుగుపాటుకు గురై రైతుకు తీవ్రగాయాలు

VIDEO: పిడుగుపాటుకు గురై రైతుకు తీవ్రగాయాలు

ASF: బెజ్జూర్ మండలం పోతేపల్లిలో ఆదివారం పిడుగుపాటుకు గురై సంజీవ్ అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. వర్షం వస్తుండటంతో తన వ్యవసాయ క్షేత్రంలోని ఇటుకలపై కవర్ కప్పుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను PHCకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.