మాజీ సీఎంకు అస్వస్థత

సౌదీ పర్యటనలో ఉన్న జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, ఎంపీ గులాం నబీ ఆజాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను రియాజ్లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పాక్ ఉగ్ర కార్యకలాపాలను ఎండగట్టేందుకు తాజాగా ఆయన బృందం సౌదీకి వెళ్లగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బీజేపీ ఎంపీ జయంత్ పాండా వెల్లడించారు.