ఆడలి వ్యూ పాయింట్ వద్ద కూలిన రక్షణ గోడలు

PPM: సీతంపేట మండలం శంభాం పంచాయతీ పరిధిలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఆడలి వ్యూ పాయింట్ వద్ద మూడు చోట్ల రక్షణ గోడలు కూలింది. ఆ సమయంలో పర్యాటకులు లేకపోవడంతో ప్రాణాపాయం జరగలేదని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి కూలిన రక్షణ గోడలకు మరమ్మతులు చేపించాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.