VIDEO: ఖమ్మం నగరంలో గాలివాన బీభత్సం

KMM: ఖమ్మంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుండి భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వాతావరణం చల్లబడడంతో ఊరట కలిగింది. అయితే, ఈదురుగాలులతో కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది.