6 ఏళ్లలో KKRకు ఇదే తొలిసారి
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో KKR జట్టు తన ప్రధాన స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి లేకుండానే బరిలోకి దిగింది. 2019 తర్వాత ఈ ఇద్దరు ఆటగాళ్లు లేకుండా KKR ఒక మ్యాచ్ ఆడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో వరుణ్ చక్రవర్తి గాయపడటంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అలాగే, అనారోగ్యంతో నరైన్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు.