మేరా యువభారత్ ఆధ్వర్యంలో క్రీడా సామగ్రి పంపిణీ
NRPT: ఊట్కూర్ మండలం మల్లేపల్లి గ్రామంలో మేరా యువభారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమం నిర్వహించి, వివేకానంద యువజన సంఘం సభ్యులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనిల్ గౌడ్ మాట్లాడుతూ.. యువజన సంఘాలను సంస్థతో అనుసంధానం చేయడం లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా వాలీబాల్, ఫుట్ బాల్ తదితర సామగ్రిని అందజేశారు.