'వారు రాజకీయ ప్రత్యర్థులే కానీ.. శత్రువులు కారు'
ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మిత్రులు ఎంపీ, ఎమ్మెల్యేలు నగేష్, పాయల్ శంకర్, అనిల్ జాధవ్ తమకు రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు కానీ, ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు కానీ, భేదాభిప్రాయాలు కావన్నారు. అభివృద్ధియే లక్ష్యంగా కలుస్తున్నామని ఆయన పేర్కొన్నారు.