'రహదారులు, రైల్వే ప్రాజెక్టులు సమయానికి పూర్తి చేయాలి'

'రహదారులు, రైల్వే ప్రాజెక్టులు సమయానికి పూర్తి చేయాలి'

TPT: జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూసంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతిని సమీక్షించారు. ఇందులో భాగంగా రైల్వే ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులతో సమన్వయం సాధించాలని సూచించారు.