VIDEO: ప్రైవేట్ బస్సులపై విజిలెన్స్ అధికారుల దాడులు
RR: వనస్థలిపురంలో విజిలెన్స్ అధికారులు ఇవాళ దాడులు నిర్వహించారు. పనామా వద్ద ప్రైవేట్ బస్సులను, గూడ్స్ వెహికల్స్ తనిఖీలు చేపట్టారు. ఉదయం 4గంటల నుంచే వాహన ధ్రువీకరణ పత్రాలను పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేశారు. ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ పరిశీలించారు. నిబంధనలకు లోబడి వాహనాలు నడిపించాలని ఆదేశించారు. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.