VIDEO: 'హెల్మెట్ లేకుంటే భారీ జరిమానా'
BPT: ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికీ హెల్మెట్ తప్పనిసరని బాపట్ల టౌన్ సీఐ రాంబాబు స్పష్టం చేశారు. పోలీసులు, అధికారులు, నాయకులు ఎవరైనా సరే నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. నేటి నుంచి నిబంధనలు కఠినంగా అమలు చేస్తామన్నారు. హెల్మెట్ లేకుండా పట్టుబడితే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు బాధ్యతగా ఉంటూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని సీఐ సూచించారు.