పశువుల అక్రమ రవాణా చేస్తే చర్యలు

మన్యం: జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పశువుల అక్రమ రవాణా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా పశు సంవర్ధక అధికారి డా.ఎస్. మన్మధరావు హెచ్చరించారు. అటువంటి పిర్యాదులు వస్తే పోలీసు, మార్కెటింగ్,రెవెన్యూ, రవాణా శాఖలతో బాధ్యులతో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.