గాజువాకలో పర్యటించిన మంత్రి
VSP: గాజువాక నియోజకవర్గంలో ఇవాళ నిర్వహించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాజువాకలో 'గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్' ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. అన్ని రంగాల్లో గాజువాకను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు.