స్క్రూటినీలో ఒక సర్పంచ్ నామినేషన్ రిజెక్ట్
KMR: జుక్కల్ మండలం కత్తల్వాడి గ్రామానికి చెందిన ఓ అభ్యర్థి నామినేషన్ స్క్రూటినీలో రిజెక్ట్ అయినట్లు ఎంపీవో రాము ఆదివారం తెలిపారు. మొత్తం 166 నామినేషన్లు దాఖలైతే అందులో 26 డబుల్ సెట్లు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం 30 సర్పంచ్ స్థానాలకు 139 మంది నామినేషన్లు చెల్లుతాయని పేర్కొన్నారు. 270 వార్డులకు 482 నామినేషన్లు రాగా అందులో 2 డబుల్ సెట్ వేశారన్నారు.