ప్రభుత్వ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన డీసీ ప్రసన్న
PLD: సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్‌లో డీసీ ప్రసన్న మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ మొత్తం పర్యటించి, వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లను పరామర్శించారు. వైద్యులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పేషెంట్లకు అందుబాటులో ఉండాలన్నారు. గైర్హాజరైన కొంతమంది వైద్యులు, స్టాఫ్ నర్సులను పిలిపించి మందలించారు.