ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BHNG: యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన లబ్ధిదారులు దోశెట్టి లలిత - రామచంద్రయ్య గౌడ్ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాన్ని మంగళవారం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు.