భారీ ఎన్‌కౌంటర్.. 22 మంది మృతి

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా దళాలు.. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. కాగా.. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.