ఈనెల 30వ తేదీ లోపు విజయ డైరీలో ఎన్నికలు

NLR: ఈనెల 30 లోగా నెల్లూరులో విజయ డైరీ డైరెక్టర్ల ఎన్నిక జరగనుందని డైరీ ఎండి కృష్ణమోహన్ తెలిపారు. ఈ సంవత్సరం ముగ్గురు డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు. అనంతరం ఎన్నికైన వారు ఛైర్మన్‌ను ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఎన్నికలు దాదాపుగా డిసెంబర్‌లోగా పూర్తి అవుతాయని వివరించారు.