భారీగా రేషన్ బియ్యం పట్టివేత
KMR: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నట్లు జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంమట్ అధికారి కిష్టయ్య తెలిపారు. హైదరాబాదు నుంచి నిజామాబాద్ వైపు లారీలో తరలిస్తున్న సుమారు 280 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని భిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద ఇవాళ పట్టుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు లారీని స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.