రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
VZM: కొత్తవలస ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వేదికలో ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వాటిని పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ విషయాన్ని గమనించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.