పురుగుమందుల దుకాణాలపై దాడులు
GNTR: చేబ్రోలు ఎస్సై డి.వెంకటకృష్ణ పర్యవేక్షణలో చేబ్రోలు ASI ఈశ్వరరావు ఆదివారం మండలంలోని పురుగుమందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చేబ్రోలు, నారాకోడూరు, వడ్లమూడి గ్రామాల్లోని దుకాణాలను తనిఖీ చేసి, స్టాక్‌ను పరిశీలించి షాపు యజమానులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.