VIDEO: డీఎస్పీ చేతుల మీదుగా హోంగార్డుకు రివార్డు
PLD: హోంగార్డు శ్రీధర్‌కు DSP రివార్డు నగదు ఆదివారం అందించారు. ఇటీవల పెదకూరపాడు మండలం పొడపాడు గ్రామంలో జరిగిన చోరీ కేసులో అధికారులతో కలిసి చాకచక్యంగా దొంగలను పట్టుకున్నందుకు డీఎస్పీ ప్రోత్సాహంగా రివార్డు నగదును అందించారు. డీఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందుకోవటం ఆనందదాయకంగా ఉందని శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో CI సురేష్, SI గిరిబాబు పాల్గొన్నారు.