నాచుపల్లిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

JGL: కొడిమ్యాల్ మండల పరిధిలోని నాచుపల్లి గ్రామంలో సోమవారం లైన్స్ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి నేత్ర పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళని రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా అధ్యక్షులు తాటిపాముల వినోద్ కుమార్ తెలిపారు.