ఇబ్బందికరంగా మారిన మూలమలుపు

PDPL: ఓదెల మండలం కొమెర ఎల్లమ్మ గుడి వద్ద మూల మలుపుతో ఇబ్బందికరంగా మారింది. ఓ వైపు విగ్రహం, మరోవైపు ఓ జెండా గద్దె నిర్మించారు. బస్సు పోయే బాట కూడా సరిగా లేదు. కానీ బడి పిల్లల కోసం ఓదెల మోడల్ స్కూల్ సర్వీసు రిస్కుతో నడపాల్సి వస్తోందని RTC డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి బస్సు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.