గొలుసు చోరీ.. మహిళను బంధించి దొంగ పరార్

KRNL: తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్‌లో గురువారం ఒక గొలుసు దొంగ మహిళను మాటల్లో పెట్టి ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలోని మూడున్నర తులాల గొలుసును దొంగిలించాడు. మహిళ పెనుగులాడటంతో పుస్తెలు మాత్రం చేతిలో మిగిలాయి. దొంగ గొలుసును తీసుకెళ్లి, ఆమెను స్టోర్ రూమ్లో బంధించి పరారయ్యాడు. భర్త రామాంజనేయులు ఇంటికి వచ్చి విషయం పోలీసులకు సమాచారం ఇచ్చారు.