శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తివేత
NZB: ఎస్సారెస్పీలోకి ఎగువ నుంచి వరద వస్తుండడంతో మంగళవారం ఉదయం 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1091 అడుగులకు (80.051 టీఎంసీలు) చేరింది. జలాశయంలో నిల్వలు పూర్తిస్థాయికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు.