పప్పు శెట్టిపాలెంలో మెడికల్ క్యాంపు

AKP: గొలుగొండ మండలం పప్పిశెట్టి పాలెం పంచాయితీ జమ్మదేవి పేటలో శుక్రవారం మెడికల్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించి చికిత్స చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దోమల వల్ల వచ్చే అనేక రకమైన విష జ్వరాల నుంచి ప్రజలు తమని తాము కాపాడుకోవాలని అన్నారు.