కరెన్సీ కౌంటింగ్ మెషీన్ వితరణ

కరెన్సీ కౌంటింగ్ మెషీన్ వితరణ

TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి శనివారం యోగిమల్లవరం యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ అధికారులు కరెన్సీ కౌంటింగ్ మెషీన్‌ను వితరణ చేశారు. సుమారు రూ.3.45 లక్షల విలువైన యంత్రాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అమ్మవారి పరకామణి సేవలో ఈ యంత్రాన్ని వినియోగించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అనంతరం పూజారులు బ్యాంక్ అధికారులకు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.