గ్రామ సర్వేయర్ సస్పెన్షన్
VZM: భోగాపురం మండలం కొంగవానిపాలెం గ్రామ సచివాలయంలో అక్రమాల ఆరోపణలు కలకలం రేపాయి. తహసీల్దార్ రమణమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. డీటీ పి.హరి సంతకాలను నకిలీగా ఉపయోగించి అధికారిక పత్రాలు, రిజిస్టర్లో నమోదు చేసినట్టు గుర్తించామన్నారు. ఈమేరకు గ్రామ సర్వేయర్ ఎన్.శంకర్‌ను సస్పెండ్ చేశారు.