అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

GDWL: 108 అంబులెన్స్‌లో గర్భిణీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన శుక్రవారం మానవపాడు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని చండూరుకు చెందిన రేణుక (24)కి శుక్రవారం సాయంత్రం పురిటి నొప్పులు అధికం కావడంతో 108 సమాచారం ఇచ్చారు. దీంతో ఆసుపత్రికి తరలిస్తున్న దారిలో పురిటి నొప్పులు రావడంతో ఆశా వర్కర్ సహాయంతో అంబులెన్స్‌లోనే డెలివరీ చేశారు.