త్వరలో నోటిఫికేషన్: సీఎం చంద్రబాబు

AP: దేవాదాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దేవాదాయశాఖలో 137 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపారు. డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్-1,3 ఈవో పోస్టులను భర్తీ చేయనున్నారు. మరో 200 వైదిక సిబ్బంది నియామకాలకు అంగీకారం తెలిపారు. 23 ప్రధాన ఆలయాలకు మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయాల అభివృద్ధి పనులు జరుగుతాయని వెల్లడించారు.