పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తనిఖీలు చేసిన అదనపు కలెక్టర్
NRPT: గండీడ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఏర్పాటు చేశారు. ఇవాళ జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ కార్యాలయానికి వచ్చిన తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి ఆటంకాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో మంజులకు సూచించారు. ఓటర్లను మాత్రమే లోపలికి అనుమతించాలని అధికారులకు సూచనలు చేశారు.