VIDEO: రచయితల గురించి విద్యార్థులకు అవగాహన
NLR: విడవలూరు పట్టణంలోని గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం కవి సమ్మేళనాలు, రచయితలు గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రవీంద్రనాథ్ ఠాగూర్, అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు వంటి కవులు గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి నిరూప పాల్గొన్నారు.