పైప్‌ లైన్ లీక్.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

పైప్‌ లైన్ లీక్.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని మినీ స్టేడియం వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్ కావడంతో నీరు వృథాగా పోతోంది. సమస్య గురించి స్థానికులు ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా, వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల లీటర్ల నీరు వృథా అవుతున్నందున, అధికారులు ఇకనైనా స్పందించి లీకేజీని పరిష్కరించాలని కోరుతున్నారు.