జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ
MBNR: జిల్లాలో శాంతి భద్రతలు సమర్థంగా కొనసాగేందుకు డిసెంబర్ 01 నుంచి డిసెంబర్ 31 వరకు పోలీస్ యాక్ట్-1861లోని సెక్షన్ 30, 30(ఎ) నిబంధనలు అమలులో ఉంటాయని ఎస్పీ జానకి ఓ ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేనిదే ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు,ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించరాదన్నారు.