ప్రజలకు అటవీశాఖ అధికారుల సూచన

ప్రజలకు అటవీశాఖ అధికారుల సూచన

అడవిలో ఒంటరిగా వెళ్లవద్దని జన్నారం అటవీశాఖ అధికారులు సూచించారు. జన్నారం మండలంలోని ఇందన్ పల్లి అటవీ రేంజ్‌లో ఐదు రోజులుగా పులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. పులి కదలికలను అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అటవీ సమీప గ్రామాల ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని వారు కోరారు. అలాగే పశువులను అడవిలోకి తీసుకు వెళ్ళవద్దన్నారు.