అదుపుతప్పి బైక్ బోల్తా.. వ్యక్తికి తీవ్రగాయాలు

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ద్విచక్ర వాహనంపై శరవేగంతో వర్ధన్నపేట వైపు వెళ్తుండగా గురువారం జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి ముళ్ళకంపలో బైక్ బోల్తా పడింది. బైకిస్ట్ తాండ్ర బాబు తలకు తీవ్రగాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.