VIDEO: ముందువెళుతున్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ
ప్రకాశం: లారీ, ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఘటన జరుగుమల్లి మండలంలో చోటుచేసుకుంది. చింతలపాలెంకు చెందిన బాషా ట్రాక్టర్ ఇసుకలోడుతో గురువారం ఒంగోలు వైపు వెళ్తూ సర్వీస్ రోడ్ నుంచి హైవే పైకి ప్రవేశించిన తర్వాత కంటైనర్ లారీ వెనుక భాగంలో ఢీ కొనడంతో ట్రాక్టర్ తిరగబడింది. ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలవ్వడంతో స్థానికులు వెంటనే మెరుగైన వైద్యం కోసం ఒంగోలు వైద్యశాలకు తరలించారు.