వ్యాపారులకు సూచనలు చేసిన ఏవో

వ్యాపారులకు సూచనలు చేసిన ఏవో

MNCL: ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేసే రైతులకు రసీదులను తప్పకుండా ఇవ్వాలని జన్నారం మండల ఇంఛార్జ్ వ్యవసాయ అధికారి జి.అంజిత్ కుమార్ వ్యాపారులకు సూచించారు. ఇవాళ జన్నారంలోని ఏవో కార్యాలయంలో ఇన్ఛార్జ్ అధికారిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఏవో ఎరువుల దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు, వ్యాపారులు పాల్గొన్నారు.