శివాలయంలో ఘనంగా దీపోత్సవం

శివాలయంలో ఘనంగా దీపోత్సవం

SKLM: సోంపేట మండలం పాలవలసలో కొలువైన శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం రెండవ సోమవారం పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి భక్తులు విశిష్ట పూజలతో, సాయంత్రం స్వామి వారి ఉత్సవ మూర్తులను తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపారాధన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.