ఎన్నికలు ముగిసేవరకు విజయోత్సవాలు నిషేధం: ఎస్పీ
BHPL: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, మూడు విడతల ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఎన్నికల మొదటి, రెండో విడతల ఫలితాలు వెలువడినప్పటికీ, గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, శోభాయాత్రలు, డీజే కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని ఆయన స్పష్టం చేశారు.