నియమాలు పాటిస్తే ప్రాణాలు సురక్షితం: కలెక్టర్
NRPT: ArriveAlive కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రాణాంతకమని హెచ్చరించారు. ముఖ్యంగా యువత, డ్రైవర్లు బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ కోరారు.