మోహన్ బాబు బర్త్ డే ట్రీట్.. వీడియో రిలీజ్
నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రమే 'ది ప్యారడైజ్'. తను పరిచయం చేసిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమాలో విలన్‌గా విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. తన రోల్ నుంచి ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బ్లాస్టింగ్ ట్రీట్‌ని అందించింది. ఇవాళ మోహన్ బాబు బర్త్ డే కానుకగా బర్త్ డే మేకింగ్ టీజర్ విడుదల చేశారు.