వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలి

వీధి కుక్కల సమస్యను  పరిష్కరించాలి

AKP: జిల్లాలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో వీధి కుక్కల సమస్యపై సమీక్షించారు. వీధి కుక్కలను పట్టుకోవడానికి ప్రతి మండలానికి ఇద్దరిని నియమించాలన్నారు. కుక్కలకు యనిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.