సచివాలయాన్ని సందర్శించిన ఎంపీడీవో
VZM: వేపాడ మండలం సింగరాయి సచివాలయాన్ని ఎంపీడీవో సిహెచ్ సూర్యనారాయణ గురువారం సందర్శించారు. సిబ్బంది హాజరు పట్టీని పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం జగ్గయ్యపేటలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు పరిశీలించి, వేతనదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.