హైటెక్ సిటీలో రోడ్డు మరమ్మతు.. ట్రాఫిక్ జామ్

హైటెక్ సిటీలో రోడ్డు మరమ్మతు.. ట్రాఫిక్ జామ్

HYD: మాదాపూర్‌లోని యశోద ఆసుపత్రి సమీపంలో ఉన్న ఫ్లైఓవర్‌పై రోడ్డు దెబ్బతినడంతో శనివారం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. హైటెక్ సిటీ, సైబర్‌ టవర్స్ వైపు వెళ్లే మార్గాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.