ఉపాధి హామీ అక్రమాలపై రేపు విచారణ

SKLM: సారవకోట మండలం గొర్రిబంధ పంచాయతీలో ఉపాధి హామీ పనులలో జరిగిన అక్రమాలుపై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు ఏపీఎం నారాయణ రావు తెలిపారు. ఈ పంచాయతీ పరిధిలో జరిగిన ఉపాధి మెటీరియల్ పనులకు సంబందించి బిల్లులు వేతనదారులకు కాకుండా వెండర్ ఖాతాకు జమ చేయడంపై స్థానికులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బిల్లులు చెల్లింపుపై విచారణ జరపనున్నారు.