నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

PLD: పెదకూరపాడు మండలంలో రెండవ శనివారం సందర్భంగా 33 kv లైన్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3: 30 గంటల వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో కరెంటు కోత ఉందని ఏఈ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడును. విద్యుత్ వినియోగదారులు అసౌకర్యాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.