ఈ నెల 8, 9న యువతకు శిక్షణ కార్యక్రమాలు: మైత్రి ప్రియ
MBNR: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి మైత్రి ప్రియ తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్నెట్ అవగాహన, టీం వర్క్, ఇంటర్వ్యూ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వబడుతుంది. అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్‌లో ఉన్న ఉపాధి కల్పన కార్యాలయంలో అడ్మిషన్స్ పొందవచ్చన్నారు.