ప్రియురాలిని పెళ్లి చేసుకున్న దర్శకుడు
'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నఅభిషన్ జీవింత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఇవాళ తన ప్రియురాలు అక్కీలతో కలిసి ఏడడుగులు వేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిషన్ తన ప్రియురాలు అక్కీలపై ప్రేమను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 31న తనను పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్ చేశాడు. చెప్పిన డేట్ ప్రకారమే అక్కీలను వివాహం చేసుకున్నాడు.