UAEపై క్షిపణి, డ్రోన్ల దాడి.. దుబాయ్‌లో ఉద్రిక్తత
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)పై డ్రోన్లు, క్షిపణులతో భారీ దాడులు జరిగాయి. దుబాయ్ క్రీక్ హార్బర్‌లోని ఓ భవనంపై డ్రోన్ దాడి జరగగా, ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన దాడుల్లో నలుగురు గాయపడ్డారు. అయితే UAE రక్షణ వ్యవస్థ అప్రమత్తమై 6 బాలిస్టిక్ మిస్సైళ్లు, 7 క్షిపణులతో పాటు ఏకంగా 39 డ్రోన్లను కూల్చివేసింది. ఈ దాడులతో దేశంలో ఉద్రిక్తతలు పెరగగా, భద్రతను మరింత కఠినతరం చేశారు.